ఎస్‌కేటీఎస్‌లో గురు పౌర్ణమి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఎస్‌కేటీఎస్‌లో గురు పౌర్ణమి..!
– ఉత్సహాంగా పాల్గొన్న విద్యార్థులు
– ఆకట్టుకున్న శ్లోకాలు, ప్రవచనాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్ రోడ్డు మార్గంలోని శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్లో(ఎస్‌కేటీఎస్) గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. గురువారం గురు పౌర్ణమిని పురస్కరించుకుని పాఠశాలలో చదువుల తల్లి సరస్వతీ దేవితో పాటు వేదవ్యాస మహర్షి చిత్రపటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం పాఠశాల విద్యార్థులతో శ్లోకాలు, ప్రవచనాల కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో విద్యార్థులు ఉత్సహంగా పాల్గొని శ్లోకాలు, ప్రవచనాలు ఇస్తూ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ ద్యావరి విష్ణువర్ధన్ రెడ్డి, కరస్పాండెంట్ పట్లోళ్ల సర్వోత్తమ్ రెడ్డి, డైరెక్టర్ ద్యావరి జయవర్ధన్ రెడ్డిలు మాట్లాడుతూ గురు పౌర్ణమి విశిష్టతను వి ద్యార్థులకు తెలియజేశారు. గురువు అంటే అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే వారని వివరించారు. అందుకనే పాఠశాలలో విద్యతో పాటు గురువు పట్ల, తల్లిదండ్రుల పట్ల మెలిగే విలువపై అవగాహన పెంచడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎ. రమేష్, ఉపాధ్యాయులు పి.చంద్రశేఖర్ రెడ్డి, అనిల్ కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

తాండూరుకు రెండు సర్కారు బడులు..!