తాండూరుకు రెండు సర్కారు బడులు..!
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కృషి
– ఉర్దూ మీడీయం విద్యార్థుల కోసం ఏర్పాటు
– ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్, మైనార్టీ నేతల హర్షం
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని తాండూరు పట్టణానికి ప్రభుత్వం కొత్తగా రెండు సర్కారు బడులను ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. తాండూరులోని విద్యారంగ అభివృద్ధికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేసిన కృషితో కొత్త బడులను కేటాయించింది.

ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తాండూరు పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీ, 26వ వార్డులోని గుమాస్తా నగర్ లో ఈ బడులను ఏర్పాటు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని 20 మందికి పైగా విద్యార్థులతో బడులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఉత్తర్వులలో స్పష్టం చేశారు. తాండూరు మంజూరు చేసిన ఈ రెండు కొత్త స్కూళ్లను ఉర్దూ మీడియం విద్యార్థుల కోసం ఏర్పాటు చేస్తున్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేసిన కృషి వల్ల ఉర్దూ మీడియం విద్యార్థులకు ప్రభుత్వ బడుల ప్రారంభానికి శ్రీకారం చుట్టడం పట్ల స్థానిక మైనార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కమల్ అతహర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు హబీబ్ లాల, యూత్ కాంగ్రెస్ నాయకులు అమెర్ అబ్దుల్లా, అడ్వకేట్ అబ్దుల్ మతీన్, మహమ్మద్ బాసిత్ అలీ, ముస్లిం వెల్ఫేర్ స్కిల్ డెవలప్ మెంట్ సోసైటీ కార్యదర్శి అబ్దుల్ ఖవి, మహమ్మద్ యూనుస్, సిరాజోద్దీన్, ఇంతియాజ్, అసద్ అలీ, అబ్దుల్ హమీద్, ఖలీద్ తదితరులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇదికూడా చదవండి…

