సాయిపూర్లో అభివృద్ధి జోరు..!
– 11వ వార్డులో సీసీ రోడ్డు పనులు
– ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి
– దగ్గరుండి చేయిస్తున్న బంటు మల్లప్ప, బంటు వేణుగోపాల్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలోని సాయిపూర్ ప్రాంతంలో ప్రగతి దూకుడు పెరిగింది. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో సాయిపూర్ ప్రాంతంలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.

నిన్న 9వ వార్డులో రూ. 5లక్షలతో సీసీ డ్రైన్ పనులు చేపట్టగా తాజాగా మంగళవారం 11వ వార్డులో రూ. 15లక్షలతో సీసీ రోడ్డు పనులు చేపట్టారు. కాంగ్రెస్ సీనీయర్ నాయకులు బంటు మల్లప్ప, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బంటు వేణుగోపాల్ ఆధ్వర్యంలో చేపడుతున్న సీసీ రోడ్డు పనులను తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కృషితో నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని అన్నారు.

పట్టణంలోని అన్ని వార్డులలో సీసీ డ్రైన్, సీసీ రోడ్లు మంజూరు చేస్తూ తాండూరు రూపురేఖలు మారుస్తున్నారని అన్నాడు అదేవిధంగా బంటు మల్లప్ప, వేణు గోపాల్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సాయిపూర్ అభివృద్ధికి అందిస్తున్న తోడ్పాటు మరువలె నిదన్నారు. ఎమ్మెల్యే సహాకారంతోనే వార్డులో సమస్యలు తీరుతున్నాయన్నారు. ఇందుకు ప్రజల తరపున ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, యువకులు పాల్గొన్నారు. సాయిపూర్ ప్రాంతంలో బంటు మల్లప్ప, బంటు వేణుగోపాల్‌లు వార్డులో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. దీంతో వార్డు ప్రజల్లో వారికి ఆదరణ పెరుగుతోంది.

ఇదికూడా చదవండి…

