వేధిక్ విశిష్ఠలో ఎలక్షన్స్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

వేధిక్ విశిష్ఠలో ఎలక్షన్స్..!
– హెడ్ బాయ్, హెడ్ గర్ల్ కు ఓటింగ్
– ఉత్సహాంగా పాల్గొన్న టీచర్లు, విద్యార్థులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని వేదిక్ విశిష్ఠ స్కూల్లో ఎన్నికలు జరిగాయి. పాఠశాలలో హెడ్ బాయ్, హెడ్ గర్ల్ కోసం ఓటింగ్ నిర్వహించారు. మంగళవారం పాఠశాలలో నిర్వహించిన ఓటింగ్ లో స్కూల్ టీచర్లు, విద్యార్థులు ఉత్సహాంగా పాల్గొన్నారు. పాఠశాల వైస్ ప్రిన్సిపల్ మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు.

పాఠశాలలో హెడ్ బాయ్, హెడ్ గర్ల్ కోసం పదో తరగతి నుంచి అమ్మాయిలు, అబ్బాయిలు పోటీ పడ్డారు. ఈ ఎన్నికల్లో పాఠశాలకు చెందిన 4వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఓటింగ్ లో పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల తరహాలో విద్యార్థులు బారులు తీరి ఓటు హక్కు వి నియోగించుకున్నారు. విద్యార్థులతో పాటు టీచర్లు కూడా ఓటు వేశారు. ఈ ఎన్నికల ఫలితాలను ఈనెల 19న వెల్లడిస్తామని పాఠశాల వైస్ ప్రిన్సిపల్ మహిపాల్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఎన్నికలపై అవగాహన కల్పించడంలో భాగంగా పాఠశాలలో హెడ్ బాయ్, హెడ్ గర్ల్ ఎన్నికలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు, టీచర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

సిట్ విచారణకు హాజరైన ధారాసింగ్