హైవే.. రోడ్లకు మహర్ధశ కల్పించండి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

హైవే.. రోడ్లకు మహర్ధశ కల్పించండి..!
– కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరితో స్పీకర్, ఎమ్మెల్యే
– ప్రణాళికలు అందించిన గడ్డం ప్రసాద్ కుమార్, మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని హైవే రోడ్లకు మహర్ధశ కల్పించాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరిని తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలు కోరారు.

శుక్రవారం నాగ్‌పూర్‌లో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరిని స్పీకర్ ప్రసాద్ కుమార్, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తాండూరు నియోజకవర్గంకు సంబంధించి మన్నెగూడ – వికారాబాద్ – తాండూరు – జహీరాబాద్ – బీదర్ రోడ్డు (135KMs), తాండూరు – పెద్దేముల్ – కోట్పల్లి – మోమిన్ పేట్ – సదాశివ పేట్ రోడ్డు (63KMs), మారేపల్లి – మదనంతపూర్ మరియు రొంపల్లి – బంటారం రోడ్డులను అభివృద్ధి చేయాలని కోరారు. అదేవిధంగా వికారాబాద్ నియోజకవర్గంకు సంబంధంచి కోకపేట్ – మోమిన్ పేట్ – బుదేరా రోడ్, వికారాబాద్ – మోమిన్ పేట్ రోడ్డు, కొత్తగడి – బంటారం, కేసారం – తోర్మామిడితో పాటు పలు ఇతర రోడ్ల అభివృద్ధి పనులపై ప్రణాళికల నివేధికను అందజేశారు.
kvcs
రోడ్లకు మహర్ధశ కల్పిస్తే ఎంతో మేలు జరుగుతుంది కేంద్ర మంత్రి వద్ద ఆకాంక్షలను వెలిబుచ్చారు. ఇందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తెలిపారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో తాండూరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉత్తమ్ చంద్ గారు, మాణిక్ రెడ్డిలు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

మహాలక్ష్మీ నమోస్తుతే..!