వైభవంగా బోడ్రాయి వార్షికోత్సవం

తాండూరు రాజకీయం వికారాబాద్

వైభవంగా బోడ్రాయి వార్షికోత్సవం
– భక్తిశ్రద్దలతో భక్తుల పూజలు
– దర్శించుకున్న మాజీ చైర్ పర్సన్, నేతలు
తాండూరు, దన్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం నడిబొడ్డున ప్రతిష్టించిన బొడ్రాయి వార్షికోత్సవ వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. గురువారం భద్రేశ్వర చౌరస్తా సమీపంలో బొడ్రాయికి ద్వితీయ వార్షికోత్సవ పూజలు నిర్వహించారు. వార్షికోత్సవంను పురస్కరించుకుని భక్తులు భక్తిశ్రద్దలతో పూజలు చేశారు.

ఈ వార్షికోత్సవ వేడుకలలో తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ పాల్గొన్నారు. బొడ్రాయిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అదేవిధంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం, జిల్లా నాయకులు బంటారం భద్రేశ్వర్, పట్టణ ఉపాధ్యక్షులు దోమ కృష్ణ, బొడ్రాయి ప్రతిష్టాపన కమిటి సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాండూరు సుభిక్షం కోసం బొడ్రాయి ప్రతిష్టించుకోవడం జరిగిందన్నారు. బొడ్రాయికి పూజలు నిర్వహించుకోవడం మన సంప్రదాయం అని అన్నారు. మరోవైపు బొడ్రాయి వార్షికోత్సవం సందర్భంగా భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

ఆర్టీసీ బస్సును ఆపేసిన లేడీ..!