శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయండి

తాండూరు రాజకీయం వికారాబాద్

శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయండి
– ప్రశాంత వాతావరణంకు తోడ్పాటు అందిస్తాం
– బషీరాబాద్ కొత్త ఎస్ఐని కలిసిన నాయకులు
బషీరాబాద్, దర్శిని ప్రతినిధి : మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక కృషి చేయాలని బషీరాబాద్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిలాషిలాషించారు.

బషీరాబాద్ కొత్తగా ఎస్ఐగా నూమాన్ అలీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆదివారం మాజీ జెడ్పిటిసి రాకేష్ మహారాజ్, వెంకటేష్ మహారాజ్, రోహిత్ మహారాజ్,కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్ఐను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్ఐ నూమాన్ అలీని శాలువాతో సన్మానించారు.

అనంతరం ఎస్ఐతో ముచ్చటించారు. మండలంలోని గ్రామాల్లో శాంతిభద్రతలను కాపాడేందుకు ప్రత్యేక చొరవ చూపించాలన్నారు. గ్రామాల్లో అల్లర్లు చెలరేగకుండా, నేరాలు జరగకుండా ప్రజలకు అవగాహన కల్పించి ప్రశాంత వాతావరణం ఉండేలా చూడాలన్నారు. ఇందుకు తమ వంతు సహాకారం అందిస్తామని తెలిపారు. దీనిపై ఎస్ఐ నూమన్ అలీ సానుకూలంగా స్పందించారు. అందరి సహకారంతో శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పవన్ ఠాకూర్, సాయి గౌడ్, రాజన్న, సిద్దు,తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

బోనం ఎత్తుకున్న న్యాయమూర్తి..!