ఇంట్లో విరబూసిన బ్రహ్మకమలం
– పూజలు నిర్వహించిన కుటుంభీకులు
– తాండూరు పట్టణంలో అద్బుతం
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఇంట్లో పవిత్రమైన బ్రహ్మ కమలం విరబూయడం ఎంతో శుభకరం. తాండూరు పట్టణం హేరూర్ వార్డులో నివాసం ఉంటున్న ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఇంచార్జ్ ప్రిన్సిపల్ మల్లినాథప్ప కుటుంబ సభ్యులకు ఆ భాగ్యం కలిగింది.

శుక్రవారం రాత్రి వారి నివాసంలో బ్రహ్మకమలం విరబూసింది. శ్రావణం మొదటి శుక్రవారం శివునికి ఇష్టమైన బ్రహ్మకమలం వికసించడంతో కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించారు. తమ నివాసంలో బ్రహ్మకమలం వికసించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఇంటి పరిసర ప్రజలు ఈ అద్భుతానికి తన్మయంతో దర్శనం చేసుకున్నారు.

అత్యంత పవిత్రమైన ఈ బ్రహ్మ కమలాలు హిమాలయాల్లోనే వికసిస్తాయని పండితులు చెబుతారు. రాత్రిళ్లు మాత్రమే విరబూస్తాయని అంటుంటారు. సాధారణంగా జులై నుంచి సెప్టెంబర్ మాసాల్లో మాత్రమే ఇవి వికస్తాయని చెబుతారు. ఇండ్లలలో బ్రహ్మకమలాలు విరబూయడం అద్బుత ఘట్టంగా నిలిచింది.

ఇదికూడా చదవండి….

