తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి జయశంకర్ సార్
– బీసీలకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని చాటిచెప్పిన మహానేత
– బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కె. రాజ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఫ్రోఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ స్పూర్తిగా నిలిచారని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అభివర్ణించారు.

బుధవారం ఫ్రోఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా తాండూరు పట్టణం ఇందిరా చౌరస్తాలో ఉన్న జయశంకర్ సార్ విగ్రహానికి రాజ్ కుమార్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికే కాకుండా ప్రత్యేక రాష్ట్రం బడుగు బలహీన వర్గాల వారికి ఉపయోగపడేలా తీర్చిదిద్దేలా ధృఢ సంకల్పంతో ఉద్యమం చేపట్టారని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సముచిత ప్రాధాన్యం ఉండాలని, వారు అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలని ఆనాడా ఆకాంక్షించిన మహానేత అని గుర్తుచేశారు. బీసీల స్థితిగతులను, వారి జీవితాల్లో తార్కికమైన మార్పు కోసం ప్రభుత్వాలకు సూచనలు చేశారని అన్నారు. ఆయన చూపిన మార్గం, ఆయన ఆశయ సాధనకు అందరు నిరంతరం కృషి చేయాలని అన్నారు. అప్పుడే ప్రొఫెసర్ జయశంకర్ సారుకు నిజమైన నివాళులు దక్కుతాయన్నారు. జోహార్.. జయశంకర్ సార్ అని మరోసారి నివాళులు అర్పించారు.

ఇదికూడా చదవండి..

