బంటు మల్లప్పకు శుభాకాంక్షల వెల్లువ
– కొనసాగుతున్న నూతన గృహప్రవేశ సందడి
– కొత్త ఇంటి వద్ద నేతల సందర్శన
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్ కు చెందిన కాంగ్రెస్ నాయకులు బంటు మల్లప్ప ముదిరాజ్‌కు శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది.

సాయిపూర్ లోని న్యూనలంద పాఠశాల పక్కన మల్లప్ప నూతన గృహ ప్రవేశ వేడుకలు సోమవారం అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. రెండో రోజు మంగళవారం కూడా ఉత్సవాలు కొనసాగాయి. కొత్త ఇంట్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

వేధ మంత్రోచ్చరణల మద్య బంటు మల్లప్ప సతీమణి బంటు లక్ష్మీ, కుటుంబ సభ్యులతో కలిసి భక్తిశద్ధలతో హోమాలు, పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ రియల్ ఏస్టేట్ వ్యాపారి, సాయిపుత్ర హోమ్స అండ్ డెవలపర్స్ అధినేత బావనోళ్ల శంకర్ యాదవ్, సతీమణి చంద్రకళలు హాజరై బంటు మల్లప్ప, కుటుంబ సభ్యులకు శుభాస్సీసులు తెలిపారు.

మరోవైపు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి సోమవారం బంటు మల్లప్ప ఇంటికి చేరుకుని శుభాకాంక్షలు తెలిపారు. మాజీ కౌన్సిలర్ పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి కూడా నూతన గృహ ప్రవేశ వేడుకలలో పాల్గొన్నారు. మంగళవారం నూతన గృహ ప్రవేశ వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మూడో రోజు అసలైన నూతన గృహ ప్రవేశ వేడుకలు జరుగుతాయని బంటు మల్లప్ప తెలిపారు. రాజకీయ పార్టీల నాయకులు, వ్యాపారులు, బంధుమిత్రులు, అభిమానులతో బంటు మల్లప్ప కొత్త ఇంట్లో సందడి నెలకొంది.


ఇదికూడా చదవండి…

