తాండూరు బీజేపీలో విషాధం

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

kvcs
తాండూరు బీజేపీలో విషాధం

– అనారోగ్యంతో మండల అధ్యక్షుడి కన్నుమూత
– విచారం వ్యక్తం చేసిన నేతలు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలంలోని బీజేపీ పార్టీలో విషాధం నెలకొంది. తాండూరు మండల అధ్యక్షులుగా కొనసాగుతున్న ప్రభు శంకర్ కన్నుమూశారు. ఈ సంఘటన బుధవారం జరిగింది.

తాండూరు మండలానికి చెందిన ప్రభు శంకర్ బీజేపీ మండల అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బుధవారం కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నేతలు విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం అందించాలని భగవంతున్ని ప్రార్ధించారు.

ఇదికూడా చదవండి…

సబితారెడ్డిపై దౌర్జన్యం దుర్మార్గం..!