యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తుల దాడి
– ముఖం, చేతులకు తీవ్రంగా గాయాలు
– గాయపరిచి పరారైన దుండగులు
– బషీరాబాద్ మండలంలో ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి : చాయ్ తాగేందుకు వెళుతున్న ఓ యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి గాయపరిచినట్లు బాధిత యువకుడి బందువులు తెలిపారు. ఈ సంఘటన బషీరాబాద్ మండలంలో జరిగింది.

బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. తాండూరు పట్టణం సాయిపూర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ ఫజల్ అనే యువకుడు స్థానికంగా జరిగిన గొడవల్లో ఇరుక్కున్నాడు. ఈ కారణంగా అతన్ని కుటుంబ సభ్యులు తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలంలో బందువుల ఇంటికి పంపించారు. గత రెండు నెలలుగా ఫజల్ అక్కడే ఉంటున్నాడు.

అయితే మంగళవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వచ్చిన ఫజల్ హోటల్‌లో చాయ్ తాగేందుకని వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డట్లు బాధితుడు తెలిపారు. ఈ దాడిలో ముఖం, నోరు, శరీర భాగాలపై గాయాలయ్యాయి. రాత్రి వేళ కుటుంబీకులకు సమాచారం అందించడంతో వారు తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం యువకుడు ఫజల్‌ను హైదరాబాద్‌కు తరలించారు.

ఈ సంఘటనపై బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ యువకుడిపై దాడి చేసిన వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్లు వారు వెల్లడించారు.

ఇదికూడా చదవండి…

