బండి ఏదైనా హెల్మెట్ మ‌స్ట్ గురూ..

తెలంగాణ హైదరాబాద్

బండి ఏదైనా హెల్మెట్ మ‌స్ట్ గురూ..
– ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్ అవుతున్న ఫోటో
హైద‌రాబాద్, ద‌ర్శిని ప్ర‌తినిధి: రోడ్డు ప్ర‌మాదాల ప్ర‌మాదాల నియంత్ర‌ణ‌లో హెల్మెట్ వినియోగం ప్రాముఖ్య‌మైంది. హెల్మెట్ వాడ‌కంపై పోలీసు అధికారులు ఎప్పటిక‌ప్పుడు అవ‌గాహ‌న క‌ల్పిస్తూనే ఉన్నారు. అధికారులు ఎంత అవ‌గాహ‌న క‌ల్పించినా ప్ర‌జ‌ల్లో చైత‌న్యం రావాల‌నేది అంద‌రి అభిప్రాయం. అధికారులు క‌ల్పించిన అవ‌గాహ‌న‌కు ఎక్కడో ఒక‌రిద్ద‌రు పాటిస్తుంటారు. అలాంటి వారిని ఉద‌హ‌రిస్తూ వీలు చిక్కిన‌ప్పుడల్లా పోలీసులు ఇత‌రుల‌కు ఆద‌ర్శంగా చూపిస్తుంటారు. స‌రిగ్గా ఇలాంటి సంఘ‌ట‌న‌నే హైద‌రాబాద్ పోలీసులు మ‌రోసారి ఉద‌హ‌రిస్తూ ప్ర‌జ‌ల‌ను చైత‌న్య ప‌రుస్తున్నారు. ఇంత‌కీ ఈ సంఘ‌ట‌న ఎక్క‌డ జ‌రిగిందంటే హైద‌రాబాద్‌లోని మూసాపేట్ మెట్రో స్టేషన్ దగ్గర వెళుతున్న ఓ మోఫెడ్ ఫోటోని ట్రాఫిక్ పోలీసులు క్లిక్ చేశారు. ఈ మోపెడ్‌పై వెళ్తున్నవారిని ప్రజంట్ జనరేషన్ యువత ఆదర్శంగా తీసుకోవాలి. పెద్ద, పెద్ద స్పోర్ట్స్ బైక్స్ నడుపుతూ కూడా మినిమం సేఫ్టీ మెజర్స్ పాటించడం లేదు. ఈ ఫోటోలోని వ్యక్తి మోపెడ్ నడుపుతూ కూడా తనతో పాటు పిలియన్ రైడర్ హెల్మెట్ ధరించేలా జాగ్రత్త తీసుకున్నాడు. ‘బండి చిన్నదే కావొచ్చు.. ప్రాణం పెద్దది బ్రదర్’ అనే క్యాప్ష‌న్‌తో పోలీసులు ఫోటో ఇంట‌ర్నెట్‌లో ఉంచారు. ప్ర‌స్తుతం ఈ ఫోటో ఇంట‌ర్నెట్‌లో వైరల్‌గా మారింది. కొంద‌రు ప్ర‌జ‌లు బండి ఏదైనా హెల్మెట్ మ‌స్ట్ గురూ అనే క్యాప్ష‌న్ల‌తో కామెంట్ల‌ను పెడుతున్నారు.