ఏసీబీ వలలో మహిళ అధికారి..!
– రూ. 15వేలు లంచం తీసుకుంటుండగా రైడ్
– వికారాబాల్ జిల్లా కలెక్టరేట్లో కలకలం
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు ఓ మహిళ అధికారి చిక్కింది. మంగళవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగన సంఘటన కలకలం రేపింది.

ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని రెవెన్యూ సెక్షన్లో సుజాత ఉద్యోగిగా పనిచేస్తున్నారు. నవాబ్ పేట్ తహసీల్దార్ కార్యాలయానికి ప్రోసిడింగ్ కాపీ పంపించేందుకు రూ. 15వేలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు స్కెచ్ వేశారు. పక్కా పథకం ప్రకారం సుజాత రూ. 15వేలు తీసుకుంటుండగా రైడ్ చేశారు.

ఆమె నుంచి లంచంగా తీసుకున్న డబ్బును సీజ్ చేశారు. అదేవిధంగా ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ అధికారిగా పనిచేస్తూ లంచం తీసుకోవడం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఈ సంఘటన కలకలం రేపింది. లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారిణి సుజాతపై కేసు నమోడు చేసి.. ఏసీబీ కోర్టులో హజరు పరుస్తామని డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. ఎవరైన అధికారులు లంచం అడిగితే ఏసీబీ శాఖను సంప్రదించాలని సూచించారు.

ఇదికూడా చదవండి…

