హిందూ ఉత్సవ సమితి రూ.51 వేల విరాళం
– అందజేసిన భావనోళ్ల శంకర్ యాదవ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు హిందూ ఉత్సవ కేంద్ర సమితికి రూ.51వేల విరాళం అందింది. ఆదివారం తాండూరుకు చెందిన ప్రముఖ రియల్ ఏస్టేట్ వ్యాపారి, సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత భావనోళ్ల శంకర్ యాదవ్ ఈ విరాళం అందజేశారు.

హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు శంకర్ యాదవ్ ను కలిశారు. ఈ సందర్భంగా హిందూ ఉత్సవ సమితికి శంకర్ యాదవ్ రూ. 51 వేలను విరాళంగా అందజేశారు. అదేవిధంగా హిందూ ఉత్సవ సమితి కార్యక్రమాలకు తోడ్పాటు అందిస్తానని శంకర్ యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి సహ కార్యదర్శి మంతన్ గౌడ్ అశోక్, ప్రచార కార్యదర్శులు కుమార్ వాల్మీకి, గోపాల్ తదిరులు ఉన్నారు.


ఇదికూడా చదవండి…

