తాండూరు అభివృద్ధి నా బాధ్యత
– ఓట్లు వేసిన ప్రజల రుణం తీర్చుకుంటా
– ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– అభివృద్ధికి డీఎంఎఫ్టీ, ఎస్డీఎఫ్ నిధుల మంజూరు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు అభివృద్ధి నా బాధ్యత అని స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డీఎంఎఫ్టీ, ఎస్డీఎఫ్ గ్రాంట్ల ద్వారా తాండూరు అభివృద్ధి పనులకు మంజూరైన నిధుల ఉత్తర్వులను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తన చేతుల మీదుగా ప్రజా ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ డీఎంఎఫ్టీ, ఎస్డీఎఫ్ ద్వారా రూ. 8.80 కోట్ల నిధులు మంజూరైనట్లు వెల్లడించారు.
తాండూరు అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని ఓట్లు వేసి గెలిపించిన తాండూర్ ప్రజల రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని అన్నారు. అదేవిధంగా కాంట్రాక్టర్లు పనులలో ఎలాంటి జాప్యం జరగకుండా నాణ్యమైన పనులు చేయాలని సూచించారు. పనులు నాణ్యత ప్రమాణాలు పాటించి పూర్తి చేయాలని అన్నారు. దీంతో పాటు పంచాయతీ రాజ్, ఇంజనీరింగ్ అధికారులు కూడా పనులు వెంటనే పూర్తి అయ్యే విధంగా కాంట్రాక్టర్లతో సమన్వయం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి చైర్మన్ బాల్ రెడ్డి, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, విజయలక్ష్మీ, బోయరవి, వెంకన్న గౌడ్, రాము, నాయకులు సర్దార్ ఖాన్, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

