19న బీజేపీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం

తాండూరు రాజకీయం వికారాబాద్

19న బీజేపీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం
– హాజరు కానున్న రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు
– విజయవంతం చేయాలి : యు.రమేష్‌ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎల్లుండి బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్‌ కుమార్ తెలిపారు.
kvcs
మంగళవారం వికారాబాద్‌ జిల్లా కేంద్రంలోని తేజా ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామచంద్రరావు హాజరవుతున్నారని చెప్పారు. అధ్యక్షులుగా నియామకం అవుతున్న సందర్బంగా జిల్లాకు ఆయన మొదటి సారి వస్తున్నారని తెలిపారు.

బీజేపీ పార్టీ బలోపేతంతో పాటు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలపై నేతలు, కార్యకర్తలను చైతన్య పరచడం జరుగుతుందని అన్నారు. కావున ఈ సమావేశంలో అన్ని మండలాల కార్యకర్తలు, బీజేపీ అభిమానులు విస్తృత స్థాయిలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఙప్తి చేశారు.

ఇదికూడా చదవండి…

హిందూ ఉత్సవ సమితి రూ.51 వేల విరాళం