నిరుపేద‌ల వైద్యానికి అండ

తాండూరు వికారాబాద్

నిరుపేద‌ల వైద్యానికి అండ
– సీఎంఆర్ఎఫ్ చెక్కును అందించిన ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి
పెద్దేముల్, ద‌ర్శిని ప్ర‌తినిధి: అనారోగ్యంతో వైద్యం చేయించుకోలేని నిరుపేద‌ల‌కు సీఎంఆర్ఎఫ్(సీఎం స‌హాయ‌నిధి) ప‌థ‌కం అండ‌గా నిలుస్తోంద‌ని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం పెద్దేముల్ మండల కేంద్రానికి చెందిన వెంకటయ్యకు సీఎంఆర్ఎంఫ్ ద్వారా మంజూరైన‌ రూ.1లక్ష.50 వేల విలువైన ఎల్ఓసిని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో పేద‌ల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా చేయూత‌నందించింద‌న్నారు. తాండూరు నియోజ‌క‌వ‌ర్గంలో అనారోగ్యానికి గురైన వారు తన కార్యాలయంలో సంప్రదిస్తే వారికి సహాయం అందించేలా కృషి చేస్తామ‌ని పేర్కొన్నారు. ఈ ప‌థ‌కాన్ని అర్హులైన పేద‌లు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు.