శ్రీశైల భక్తుల సేవకు సిద్దమైన శంకరన్న..!

తాండూరు రాజకీయం వికారాబాద్

శ్రీశైల భక్తుల సేవకు సిద్దమైన శంకరన్న..!
– రేపటి నుంచి మహా అన్నప్రసాద వితరణ
– అన్నదాన స్థలం, సమయం వివరాలివే
– తాండూరు భక్తులు పాల్గొనాలని విజ్ఞప్తి
తాండూరు, దర్శిని ప్రతినిధి : శ్రీశైలంలో శివ భక్తుల సేవకు తాండూరుకు చెందిన ప్రముఖ రియల్ ఏస్టేట్ వ్యాపారి, శ్రీసాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్‌ అధినేత భావనోళ్ల శంకర్ యాదవ్ సిద్దమయ్యారు.

ప్రతి యేడాది శివరాత్రి సందర్బంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలలో భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని శంకర్ యాదవ్ ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రేపు 7వ నుంచి 10 వరకు నాలుగు రోజులపాటు అన్నప్రసాద వితరణకు ఏర్పాట్లు చేశారు.

ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమం శ్రీశైలం పుణ్యక్షేత్రంలో పాతాళ గంగకు వెళ్లే మార్గంలో, కాటేజ్ నంబర్–100 వెనుక భాగంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నాలుగు రోజుల పాటు నిరంతరం అన్నదాన కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. శ్రీశైలానికి విచ్చేసే శివ స్వాములు, శివ భక్తులు అందరూ ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని శివ–పార్వతుల ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు. ముఖ్యంగా వికారాబాద్ జిల్లా & తాండూర్ ప్రాంతం నుంచి వచ్చే శివ స్వాములు, శివ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని శంకర్ యాదవ్ విజ్ఞప్తి చేశారు.

ఇదికూడా చదవండి…

దశ తిరగాలంటే.. చేతి గుర్తుకు ఓటేయండి..!