ఏటీసీతో ఉపాధికి భరోసా..!

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

ఏటీసీతో ఉపాధికి భరోసా..!
– విద్యార్థులకు తక్షణ ఉద్యోగ అవకాశాలు
– మండలాల విద్యాధికారులు, ప్రిన్సిపల్‌లు
– తాండూరులోని ఏటీసీ కాలేజీ సందర్శన
తాండూరు, దర్శిని ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా ఏర్పాటు చేస్తోన్న అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) ద్వారా ఉపాధి భరోసా అందుతుందని తాండూరు నియోజకవర్గంలోని మండలాల విద్యాధికారులు, ప్రభుత్వ కాలేజీల ప్రిన్సిపల్ లు అన్నారు.
kvcs
సోమవారం తాండూరులో నిర్మించిన ఏటీసీ సెంటర్ ను తాండూరు నియోజకవర్గంలోని తాండూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ మళ్లీనాథప్ప, బషీరాబాద్ ప్రిన్సిపల్ నర్సింహారెడ్డి, పెద్దేముల్ ప్రిన్సిపల్ నర్సింలు, మండల విద్యాధికారులు వెంకటయ్య గౌడ్, నర్సింగ్ రావు, రమేష్, రాములు, ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ప్రతిధులు ఏటీసీ కాలేజీని ప్రిన్సిపల్ సాయిబన్నతో కలిసి సందర్శించారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ యువత, విద్యార్థులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఏటీసీ కేంద్రాలు కీలకంగా నిలుస్తాయన్నారు. తాండూరు ప్రాంత విద్యార్థుల అభివృద్ధికి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కృషి చేయడం అభినందనీమయన్నారు. ఏటీసీలో చేరి కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు, యువతకు తక్షణ ఉపాధి, ఉద్యోగాలు పొందడం ఖాయమని అన్నారు. తాండూరు ఏటీసీలో 6 అత్యాధునికమైన కోర్సులను అందుబాటులోకి తీసుకవడంతో పాటు 172 సీట్లను కేటాయించడం జరిగిందన్నారు. అసక్తిగల తాండూరు యువత ఏటీసీలో చేరేందుకు ఇది సువర్ణ అవకాశమని, 28వ తేదిలోపు వివిధ కోర్సులకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.

ఇదికూడా చదవండి…

రామ భక్తి చాటుకుంటున్న భక్తులు