రామ భక్తి చాటుకుంటున్న భక్తులు

తాండూరు రాజకీయం వికారాబాద్

రామ భక్తి చాటుకుంటున్న భక్తులు
– ఇందిరానగర్ రామ మందిరానికి విరాళాలు
– ఆలయ పునర్ నిర్మాణానికి చేయూత
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఇందిరానగర్ రామ మందిరంలో వెలసిన రాముడిపై భక్తులు భక్తిని చాటుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా దేవాలయ పునర్ నిర్మాణ పనులకు భక్తులు తోచినంత విరాళాలు అందిస్తున్నారు.
kvcs
తాజాగా సోమవారం ఇందిరానగర్ కు చెందిన గడిల ప్రవీణ్ కుమార్ రూ.50వేలు, పాటి విక్రమ్ రెడ్డి రూ. 50వేలు, రవికుమార్ రూ. 11 వేలు, ఏ. శేఖర్ 10,100ల చొప్పున దేవాలయ పునర్ నిర్మాణానికి విరాళాలు అందించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటి సభ్యులు మాట్లాడుతూ కూలి నుంచి వ్యాపారి, రాజకీయ నేతలు అనే తేడా లేకుండా అందరు విరాళాలు అందించడం సంతోషకరమన్నారు.

దేవాలయ పునర్ నిర్మాణంలో భక్తులు భాగస్వాములు కావాలన్నారు. భక్తులు దేవాలయానికి వస్తూ రూపేణ. నగదు రూపేణా సహాకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమంలో ఆలయ కమిటి అధ్యక్షులు శ్రీనివాస్, గౌరవాధ్యక్షులు కె. శేఖర్, బోయరాజు, కోశాధికారి అంజిల్ రెడ్డి, సభ్యులు నర్సింలు, దోమ శ్రీనివాస్, శ్రావణ్ కుమార్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

మృతుని కుటుంబానికి దివిటి ఎల్లప్ప పరామర్శ