
గణనాథునికి ఎమ్మెల్యే తొలిపూజలు
– దర్శించుకుని పూజలు చేసిన మనోహర్ రెడ్డి
– నెహ్రు గంజ్‌లో వినాయక చవితి శోభ
– పాల్గొన్న గ్రీన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్, వ్యాపారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : గణనాథునికి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముందుపూజలు నిర్వహించారు. బుధవారం వినాయక చవితి సందర్భంగా తాండూరు గ్రీన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని నెహ్రు గంజ్‌లో వినాయకుని ప్రతిష్టించారు.

ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వినాయకున్ని దర్శించుకున్నారు. వేధమంత్రోచ్చరణల మద్య ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వినాయకునికి తొలిపూజలు నిర్వహించారు. అనంతరం అసోసియేషన్ సభ్యులు, పలువురు వ్యాపారులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని సన్మానించారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, డీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, గ్రీన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకట్రాములు గౌడ్, ప్రధాన కార్యదర్శి పటేల్ కిరణ్ కుమార్, సహాయ కార్యదర్శి భోజిరెడ్డి, కోశాధికారి బానాకారి కృష్ణ, మాజీ అధ్యక్షులు సభ్యులు పటేల్ శ్రీశైలం, కట్కం వీరేందర్, బంటారం సుధాకర్, సల్లా దామోదర్, పటేల్ రాంరెడ్డి, నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు, మార్కెట్ కమిటి డైరెక్టర్లు ఉదయ్ భాస్కర్, జర్నప్ప, నాయకులు బాతుల వెంకటయ్య, మల్లేశం, వ్యాపారులు, హమాలి కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

