హిందూ ఉత్సవ సమితికి మరో భారీ విరాళం

తాండూరు రాజకీయం వికారాబాద్

హిందూ ఉత్సవ సమితికి మరో భారీ విరాళం
– రూ.4,01,116లు ప్రకటించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– అందజేసిన ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు హిందూ ఉత్సవ సమితికి మరో భారీ విరాళం అందింది. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి భారీ విరాళాన్ని ప్రకటించారు.
kvcs
వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా తన వంతుగా రూ. 4లక్షల 1వెయ్యి 116లను ప్రకటించారు. శనివారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోదరుడు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే ప్రకటించిన నగదును హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలుకు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వినాయక చవితి పండగను శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు.

ఆదివారం జరిగే నిమజ్జన శోభాయాత్రను ఎలాంటి అవరోధాలు, అటంకాలు కలగకుండా జాగ్రత్తగా జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సమితి కోశాధికారి రొంపల్లి సంతోష్ కుమార్, అధికార ప్రతినిధి పర్యాద రామకృష్ణ, సహ కార్యదర్శి కోట్ల రాజ్ కుమార్, సాంస్కృతిక కార్యదర్శులు దావులయ్య, దేవగారి రమేష్, ప్రచార కార్యదర్శులు కుమార్ వాల్మీకీ తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

చిరు వ్యాపారులకు బెస్ట్‌ స్కీం..!