చిరు వ్యాపారులకు బెస్ట్ స్కీం..!
– డిజిటల్ పేమెంట్ల కోసం రూ.1600ల క్యాష్ బ్యాక్
– వ్యాపారాల అభివృద్ధికి రుణాలు, వడ్డీలో రాయితీ కూడా
– ఎలాంటి ష్యూరీటీ కూడా అవసరం లేదు
దర్శిని డెస్క్ : దేశంలోని చిరు వ్యాపారుల కోసం కేంద్ర ప్రభుత్వం బెస్ట్ స్కీంను అమలు చేస్తోంది. ఈ పథకం కింద డిజిటల్ లావాదేవాలు జరిపేందుకు ఉచితంగా క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది.

అలాగే చిరు వ్యాపారాల అభివృద్ధికి సూక్ష్మ రుణాలను అందిస్తోంది. రుణాలు సకాలంలో చెల్లించిన వారికి రుణాల వడ్డీలపై రాయితీ కూడా అందిస్తోంది. గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్బర్ నిధి(స్వనిధి) ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తోంది. 2020 జూన్ 1న ఈ పథకాన్ని ప్రారంభించారు. 2030 మార్చి వరకు ఈ పథకాన్ని అమలు చేసి వ్యాపారులకు అందుబాటులో ఉంచనున్నారు.

పట్టణాల్లోని మున్సిపల్, స్థానిక సంస్థలు వీధి వ్యాపారులకు జారీ చేసిన వెండింగ్ సర్టిఫికెట్ ఉన్న వారికి ఎలాంటి ష్యూరీటి లేకుండా విడతల వారిగా రుణాలు అందిస్తున్నారు. మొదటి విడతలో రూ. 15వేలు, రెండో విడతలో 25 వేలు, మూడో విడతలో రూ. 50వేలు అందిస్తున్నారు. వ్యాపారులు పొందిన రుణం సకాలంలో చెల్లిస్తే 7శాతం వడ్డీ రాయితీ కూడా అందిస్తున్నారు. దీంతో పాటు డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించేందుకు రుణాలు పొందిన వారికి రూ. 1600ల క్యాష్ బ్యాక్‌ను కూడా అందిస్తున్నారు.
రుణాలు పొందేందుకు అర్హులై వ్యాపారులు దరఖాస్తు చేసుకోవడానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీ మీ పట్టణాల్లో ఉండే మీసేవా కేంద్రాల్లో గాని, కామన్ సర్వీస్ సెంటర్ లకు వెళ్లి పీఎం స్వనిధి పథకానికి అధికారిక పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చారు. చిరు వ్యాపారులకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతోంది. చిరు వ్యాపారాలను అభివృద్ధి చేసుకునేందుకు ఇది గొప్ప పథకం అని అధికారులు సూచిస్తున్నారు.

ఇదికూడా చదవండి…

