రామ మందిరంకు రూ.1.50లక్షల విరాళం
– ప్రకటించిన లైబ్రరీ మాజీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్
– ధన్యవాదాలు తెలిపిన ఆలయ కమిటి
తాండూరు, దర్శిని ప్రతినిది : తాండూరు పట్టణం ఇందిరానగర్ లోని రామ మందిరం పునర్ నిర్మాణంకు వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ విరాళం ప్రకటించారు.

సోమవారం రామ మందిరం దేవాలయ కమిటి సభ్యులు మురళీకృష్ణ గౌడ్ ను కలిశారు. గత కొన్ని రోజులుగా రామ మందిర పునర్ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు ఆయనకు వివరించారు. దేవాలయ పునర్ నిర్మాణంకు తమవంతు తోడ్పాటు అందించాలని కోరారు. ఇందుకు మురళీకృష్ణ గౌడ్ స్పందిస్తూ దేవాలయం అభివృద్ధికి తన వంతుగా రూ. 1లక్షల 50వేల విరాళం ప్రకటించారు.

పునర్ నిర్మాణంలో భాగస్వాములు అవుతామన్నారు. దీనికి దేవాలయ కమిటి సభ్యులు మురళీకృష్ణ గౌడ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వడ్డె శ్రీనివాస్, దేవాలయ కమిటి గౌరవాధ్యక్షులు శేఖరక్, బోయరాజు, అధ్యక్షులు ఎం.శ్రీనివాస్, ఉపాధ్యక్షులు దోమ శ్రీనివాస్, సభ్యులు చందు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

