రోడ్ల దుస్థితి మార్చండి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

రోడ్ల దుస్థితి మార్చండి..!
– ఇరువైపులా గ్రావెల్ వేస్తే ప్రమాదాలకు చెక్
– ఆర్ అండ్ బీ అధికారులకు సునితమ్మ ఆదేశం
యాలాల, దర్శిని ప్రతినిధి : అధ్వాన్నమైన రోడ్ల పరిస్థితిపై వికారాబాద్‌ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునితా మహేందర్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. పాడపోతున్న రోడ్లపై మరమ్మత్తులు చేయరా అంటూ ఆర్‌అండ్‌బి అధికారుల వైఖరిని తప్పుపట్టారు. ప్రమాదాలు జరిగితే కానీ స్పందించరా అంటూ ప్రశ్నించారు. వివరాల్లోకి వెళితే.. యాలాల మండలంలోని పగిడ్యాల్ నుంచి కమల పూర్ వరకు రోడ్డు మార్గంలో కారులో సునీతారెడ్డి ప్రయాణం చేశారు. ఈ క్రమంలో రోడ్డుకు ఇరువైపులా కోతకు గురి కావడంతో కారును ఆపి రోడ్డు దుస్థితిని పరిశీలించారు. కోతకు గురైన రోడ్డు వల్ల వాహనదారులు ప్రమాదాలకు గురువుతున్నారని అన్నారు. రోడ్డు వేసిన సమయంలోనే ఇరువైపులా గ్రావెల్ వేసేలా అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. పగిడ్యాల్ కమల్ పూర్ రోడ్డుకు ఇరువైపులా వెంటనే గ్రావెల్ వేయాలని ఆదేశించారు. రోడ్డు దుస్థితి మారితే ప్రమాదాలకు చెక్‌ పెట్టే అవకాశం ఉటుందన్నారు. జెడ్పీ చైర్ పర్సన్ చేసిన సూచనపై నాయకులు, వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి…

తాత తడబడలేదు..!

chaithany collage