గ్రూప్-1 పరీక్ష దొంగలెవరో తేల్చాలి
– కాంగ్రెస్ అసమర్థత వల్లే అవకతవకలు
– సిట్టింగ్ జ్యూడీషియల్ కమీషన్ ఏర్పాటు చేయాలి
– తాండూరులో బీఆర్ఎస్వీ నాయకుల నిరసన
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 పరీక్ష దొంగలను గుర్తించి.. కఠిన చర్యలు తీసుకోవాలని తాండూరు బీఆర్ఎస్వీ నాయకులు డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీను పిలుపు మేరకు గురువారం తాండూరు బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షులు జోగుల ఎబినేజర్ పట్టణ అధ్యక్షులు సందీప్ రెడ్డి, జిల్లా నాయకులు దత్తాత్రేయ రావు తదితరులు నల్ల బ్యాడ్జీలు ధరించి తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా ఆయన విగ్రహానికి వినతిపత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసమర్థత వల్లే గ్రూప్-1 పరీక్షలలో అవకతవకలు జరిగాయని విమర్శించారు.

ఉద్యోగాలపై ఆశలు పెట్టుకున్న నిరుద్యోగ యువత ఆశలను వమ్ము చేసిందని అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే జీఓ నెం.29ను రద్దుచేయాలని అన్నారు. మళ్లీ గ్రూప్1 పరీక్షలకు నోటిఫికేషన్ జారీ చేయాలన్నారు. హైకోర్టు ఆదేశించిన విధంగా సిట్టింగ్ జ్యూడిషీయల్ కమీషన్ ఏర్పాటు చేసి.. గ్రూప్1 దొంగలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే మోసపూరిస కాంగ్రెస్ సర్కారుకు గుణపాఠం చెప్పక తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు, యువకులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

