సమస్యల పరిష్కారానికే మార్నింగ్ వాక్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

సమస్యల పరిష్కారానికే మార్నింగ్ వాక్..!
– తాండూరు మున్సిపల్ కమీషనర్ యాదగిరి
– ఇందిరానగర్ లో పర్యటించన కమీషనర్
తాండూరు, దర్శిని ప్రతినిధి : సమస్యల పరిష్కారానికి మార్నింగ్ వాక్ కార్యక్రమం చె పట్టడం జరుగుతుందని తాండూరు మున్సిపల్ కమీషనర్ యాదగిరి అన్నారు. మంగళవారం తాండూరు మున్సిపల్ పరిధి 5, 6వ వార్డులో కమీషనర్ యాదగిరి మార్నింగ్ వాక్ లో పాల్గొన్నారు.
kvcs
ఆయా వార్డుల్లో పర్యటించారు. వార్డులలో పారిశుద్ధ్యం, వీధి దీపాలు, పార్కుల నిర్వహణ పరిశీలించారు. డ్రైన్ లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని కార్మికులకు సూచించారు. పిచ్చి మొక్కలను తొలగించాలని సూచించారు. వీధి దీపాల సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. ప్రజలు కూడా సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకుని పరిసరానలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. దోమల వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

6వ వార్డులో మాజీ కౌన్సిలర్ బోయ రవిరాజుతో కలిసి పర్యటించారు. మురుగు కాలువలు, మరుగుదొడ్లు తదితర సమస్యలు పరిశీలించారు. ఈ సందర్భంగా కమీషనర్ యాదగిరి మాట్లాడుతూ పట్టణ ప్రజల సమస్యల పరిష్కారానికే మార్నింగ్ వాక్ చేపట్టడం జరుగుతుందన్నారు. ఇబ్బందులు, సమస్యలను గుర్తించి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బోయరాజు, ఇంచార్జ్ శానిటరీ ఇను స్పెక్టర్లు వెంకటయ్య, ఉమేష్, వార్డు ఆఫీసర్ అనిల్, ఎన్విరాల్ మెంట్ ఇంజనీర్ ప్రవీణ్, వివిధ విభాగాల సిబ్బంది మ హేష్, రాజు, భూపతి, రవి, సాయి తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

రాముని గుడికి రూ.50వేల విరాళం