ఎంసీహెచ్ వైద్యురాలిపై వేటు..!
– గర్భిణీ మృతిపై విచారణ జరిపి చర్యలు
– విధుల్లో నిర్లక్ష్యం వహించరాదని హితవు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని మాతా శిశు ఆసుపత్రి వైద్యురాలుపై వైద్య విచారణ బృందం వేటు వేశారు. సోమవారం ఆసుపత్రిలో ప్రసవానికి వచ్చిన గర్భిణీ మృతి చెందిన సంగతి తెలిసిందే.

కోడంగల్ నియోజకవర్గం రావులపల్లి నుంచి అఖిల అనే గర్భిణీని ఆమె తల్లిదండ్రులు ఆదివారం రాత్రి రెండో కాన్పుకోసం తీసుకవచ్చారు. అర్దరాత్రి వచ్చినా ఉదయం వరకు ఎవ్వరు పట్టించుకోలేక పోవడంతో సోమవారం తెల్లవారు జామున అఖిల మృతి చెందిదని కుటుంభీకులు ఆందోళన చేపట్టారు. ఈ సంఘటనపై ఉన్నతాధకారులు విచారణ బృందం ఆసుపత్రిలో వివరాలను సేకరించింది.

అఖిల ఆసుపత్రికి వచ్చినప్పటి నుంచి మరణించే ముందు వరకు ఏం జరిగిందని సంబంధిత వైద్యురాలు, సిబ్బందిని విచారాణ జరిపారు. పలు వివరాలను కూడా సేకరించారు. ఇందులో వైద్యురాలు డా.మంజుల విధుల పట్ల నిర్లక్ష్యం వహించినట్లు ప్రాథమికంగా నిర్దారించారు. ఈ మేరకు ఆమెను విధుల్లో నుంచి తొలగించేందుకు నిర్ణయించారు. అదేవిధంగా ఆసుపత్రిలో వైద్య సేవలు అందించడంలో ఎవ్వరు నిర్లక్ష్యం వహించరాదని విచారణ బృందం హితవు పలికారు.

ఇదికూడా చదవండి…

