శివ స్వాముల సేవలో డీఎస్పీ..!

తాండూరు రాజకీయం వికారాబాద్

శివ స్వాముల సేవలో డీఎస్పీ..!
– అన్నదానం చేసిన బాలకృష్ణారెడ్డి
– డీఎస్పీని సన్మానించిన శివస్వాములు
తాండూరు, దర్శిని ప్రతినిధి : శివ మాల దీక్షలో ఉన్న స్వాముల సేవలో తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తరించారు. మంగళవారం తాండూరు పట్టణం గౌతాపూర్ రోడ్డు మార్గంలోని భవాని మాత దేవాలయంలో తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శివ స్వాములకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ బాలకృష్ణారెడ్డి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శివమాల దీక్ష చేపట్టిన స్వాములకు స్వయంగా అన్నదానం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివ దీక్ష ఎంతో పవిత్రమైందని అన్నారు. శివ స్వాములకు అన్నదాన సేవ చేయడంలో పరమశివునికి సేవ చేసినంత భావన కలిగిందన్నారు. శివ నామస్మరణతో అందరు భక్తి భావం కలిగి ఉండడం అభినందనీయమన్నారు. అదేవిధంగా అన్నదానం చేసిన డీఎస్పీ బాలకృష్ణారెడ్డిని శివస్వాములు ఘనంగా సన్మానించారు.

ఇదికూడా చదవండి…

భూకైలాస్‌లో భారీ భద్రత ఏర్పాట్లు..!