మహేంద్రుడికి జేజేలు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మహేంద్రుడికి జేజేలు..!
– తాండూరులో ఘనంగా జన్మదిన వేడుకలు
– బిడ్కర్ రఘు ఆధ్వర్యంలో యువకుల రక్తదానం
– జిల్లా ఆసుపత్రిలో పండ్లు, అల్పహారం వితరణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ చీఫ్ విప్, మాజీ మంత్రి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి తాండూరు నేతలు, యువకులు, అభిమానులు జేజేలు పలికారు.

మంగళవారం మహేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా తాండూరుకు చెందిన యువనాయకులు బిడ్కర్ రఘు పట్టణంలోని జిల్లా ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. దాదాపు 26 మంది యువకులు పాల్గొని రక్తదానం చేశారు. అదేవిధంగా మహేందర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆసుపత్రిలోని రోగులకు, బంధువులకు అల్పహారం పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పరిమళ, అబ్దుల్ ఖవి, భగవాన్, పునీత్ కుమార్, శివానంద్, సంకేత్, సిద్ధు, ఆనంద్ గౌడ్, మణికంఠ శ్రీనివాస్, కాంతు, రజక క్రిష్ణ, నర్సింహా, మెట్లి వెంకట్, యువకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం బిడ్కర్ రఘు, పలువురు నేతలు హైదరాబాద్‌లో మహేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. మహేందర్ రెడ్డిని గజమాలతో సత్కరించి.. ఫోటో జ్ఞాపికను అందజేసి జేజేలు పలిశారు.

ఇదికూడా చదవండి…

మహేందర్ రెడ్డికి శుభాకాంక్షల వెల్లువ