మహిళలు ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

మహిళలు ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి
– వైద్య ఆరోగ్య శిబిరాలను స్వదినియోగం చేసుకోవాలి
– ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– తాండూరు ఎంసీహెచ్‌లో మెగా ఆరోగ్య శిభిరం
తాండూరు, దర్శిని ప్రతినిధి : మహిళలు ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు పట్టణం మాతా శిశు ఆసుపత్రిలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కింద మెగా ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరై ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా గర్భిణీలకు వైద్య పరీక్షలు, టీబీ, బీపీ, చెవి, ముక్కు, చర్మ, రొమ్ము, సికిల్ పరీక్షలతో పాటు కీశోర బాలికల కోసం ఏర్పాటు చేసిన వైద్య సేవల విభాగాలను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కుటుంబంలో మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం బలంగా, ధృడంగా ఉంటాయని అన్నారు.

ఆరోగ్య సమస్యల విషయంలో మహిళలు నిర్లక్ష్యం వహించరాదని అన్నారు. మహిళల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తుందని అన్నారు. వచ్చేనెల 2వ తేది వరకు నిర్వహించే వైద్య శిబిరాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ డా.లలితాదేవి, డీసీహెచ్ఎస్ డా. ఆనంద్, డిప్యూటీ డీఎంహెచ్ఎం డా.రవీందర్ యాదవ్, తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, నాయకులు అజయ్ ప్రసాద్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డా.రాజు, ఎంసీహెచ్ ఆర్ఎంఓ డా.అనిల్ కుమార్, మున్సిపల్ కమీషనర్ యాదగిరి, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

పేదల ఆరోగ్యానికి భరోసా.. సీఎంఆర్ఎఫ్