రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఎన్నిక

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఎన్నిక
– అధ్యక్షులుగా శేఖర్, కార్యదర్శిగా నాగయ్య
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డు ఉద్యోగుల సంఘం కార్యవర్గంను ఎన్నుకున్నారు. గురువారం తాండూరు పట్టణం బసవణ్ణ కట్ట సమీపంలో ఉన్న కార్యాలయంలో ఈ ఎన్నిక జరిగింది.
kvcs

2025-28 సంవత్సరానికి గాను కార్యవర్గంను ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షులుగా కె.శేఖర్, ఉపాధ్యక్షులుగా కె. నాగిరెడ్డి, కె. పద్మనాభరావు, కార్యదర్శిగా కె. నాగయ్య, కోశాధికారిగా ఎస్. బసవరాజు, సంయుక్త కార్యదర్శిగా టి.వెంకటయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీగా కె.ప్రకాష్, పబ్లిసిటి సెక్రటరీగా కె.దివాకర్ రెడ్డి, డిస్ట్రిక్ కౌన్సిలర్ గా ఏ. శ్రీనివాస్, పి. ఉదయ్ శంకర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్ట్ ఉద్యోగులు, సంఘం సభ్యులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

దిడ్డి వాగులో వ్యక్తి గల్లంతు..!