ఆధ్యాత్మిక సేవలో విఠల్ నాయక్…!
– ప్రతి యేడాదిలాగే నవరాత్రి ఉత్సవాలకు విరాళం
– ధన్యవాదాలు తెలిపిన కమిటి సభ్యులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, వినాయక గ్రూపు సంస్థల అధినేత వర్త్యా విఠల్ నాయక్ గొప్ప మనసును చాటుకున్నారు. ప్రతి యేడాది మాదిరిగానే శరన్నవరాత్రుల ఉత్సవాల నిర్వహణకు విరాళం అందించారు.

తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ప్రతి యేడాది దేవీ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తన్నారు. ఈ యేడాది జరిగే ఉత్సవాల నిర్వహణ కోసం కమిటి సభ్యులు విఠల్ నాయక్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. నవరాత్రి ఉత్సవాల కోసం విఠల్ నాయక్ కమిటి సభ్యులకు రూ. 45వేల నగదును విరాళంగా అందజేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ దేవీ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకొ వాలని, ఆసుపత్రికి వచ్చే రోగులకు అంతా మంచే జరగాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, కమిటి సభ్యులు రాజు, ప్రభాకర్, తులసి రామ్, అంజయ్య, నర్సింలు, శ్రీనివాస్, గోపాల్, వీరేశం, గోవింద్,,రమేష్, జలీల్, రవీందర్ తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

