42శాతం రిజర్వేషన్లు పచ్చి మోసం..!
– ఓ చేత్తో ఇచ్చి.. మరో చేత్తో అడ్డుకునే కుట్ర
– ఇచ్చిన హామిలను అమలులో విఫలం
– కాంగ్రెస్, బీజేపీలకు గుణపాఠం తప్పదు
– ఇంటింటికి కాంగ్రెస్ బాకీల ఉద్యమంకు శ్రీకారం
– బీసీ కమీషన్ మాజీ సభ్యులు నూలి శుభప్రద్ పటేల్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్ల పేరుతో మోసం చేసేందుకు యత్నిస్తోందని రాష్ట్ర బీసీ కమీషన్ మాజీ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు నూలి శుభప్రద్ పటేల్ విమర్శించారు.

ఆదివారం తాండూరు పట్టణంలోని ఎన్ఎస్పీ ట్రస్టు కార్యాలయంలో శుభప్రద్ పటేల్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం 42శాతం బీసీల రిజర్వేషన్లపై ఇచ్చిన జీఓలో మోసం దాగి ఉందని అన్నారు. కేవలం జీవో మేరకే రిజర్వేషన్లను ప్రకటించే అవకాశం ఉంటే 22నెలల సమయం ఎందుకు అవసరమని ప్రశ్నించారు. జీఓలను కోర్టు కొట్టేస్తుందని తెలిసి డ్రామాలు ఆడుతుందని అన్నారు. రిజర్వేషన్ల విషయంలో తమిళనాడు తరహాలో చట్టం చేసి రిజర్వేషన్లను ప్రకటించాలని బీఆర్ఎస్ పార్టీ నుంచి కోరడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిందని గుర్తుచేశారు. రిజర్వేషన్ల కోసం చట్టం చేసి కేంద్రానికి పంపిస్తామని చెప్పిందని, అనుకున్నట్లుగా చట్టంను కేంద్రానికి పంపితే పెండింగ్ లో ఉండిపోయిందని, చట్టంతో పాటు అసెంబ్లీలో తీర్మానించిన బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్ లోనే ఉండిపోయాయని అన్నారు. చట్టం పెండింగ్లో ఉండగానే జీఓలు ప్రకటించి మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం జీఓలు జారీ చేస్తే ఆయన ముఖ్య అనుచరుడు మాధవ రెడ్డి అనే వ్యక్తి ద్వారా జీఓలపై హౌస్ మోషన్ పిటిషన్ ద్వారా కోర్టుకు వెళ్లారని ఆరోపించారు.

ఓ చేత్తో రిజర్వేషన్లు ఇచ్చి.. మరో చేత్తో అడ్డుకునే కుతంత్రాలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎంతో పాటు మంత్రులతో సన్నిహిత సంబంధాలు ఉన్న మాధవ రెడ్డి చేతో కేసును ఉపసంహరించుకోమని చెప్పే అవకాశం లేదా అని ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ బీసీ రిజర్వేషన్ల బిల్లుపై జీఓ జారీ చేస్తే కోర్టు కొట్టేసిందని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అదే జీవోల ద్వారా రిజర్వేషన్లను ప్రకటించి మోసం చేసే ప్రయత్నం చేస్తోందని అన్నారు. బీసీల రిజర్వేషన్ల చట్టంపై కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు. ఎమ్మెల్యేలో దర్నాలు చేస్తే సోనియాగాంధీ. రాహుల్ గాంధీ. మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ ఎవ్వరు. కూడా మద్దతు తెలుపలేరని, అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీల రిజ్వేషన్లపై చిత్త శబద్ది లేదనే విషయం అర్థమవుతోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ కూడా బీసీ రిజర్వేషన్ల విషయంలో పక్షపాత ధోరణిని ప్రదర్శిస్తుందని విమర్శించారు. ఈ రెండు పార్టీలకు ఎన్నికల్లో గుణపాఠం తప్పదని అన్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలం అయ్యిందని అన్నారు. రైతుబీమా, పెట్టుబడి. మహిళలకు ఆర్థిక చేయూత, నిరుద్యోగులకు భృతి వంటి ఎన్నో హామిలను విస్మరించిందని అన్నారు. కాంగ్రెస్ చేసిన మోసాలపై కాంగ్రెస్ బాకీల కార్డు అనే ఉద్యమంతో ఇంటింటికి వెళ్లే కార్యక్రమాన్ని త్వరలో శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ మోసాలను ప్రజలకు వివరించి ఎన్నికల్లో బుద్ధిచెబుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు భాను. నరేష్ గౌడ్, సిద్దిఖి, శ్రీధర్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి….

