పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
– మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య
– గ్రీన్ చాలెంజ్ లో మొక్కలు నాటిన నేతలు, అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : పర్యావరణ పరిరక్షణకు అందరు మొక్కలు నాటాలని తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య అన్నారు. బుధవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవంను పురస్కరించుకుని తాండూరు పట్టణ శివారు ఖాంజాపూర్ గేటు సమీపంలో శ్రీశ్రీ వెంకటేశ్వర దేవాలయం ప్రాంగణం, మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ స్కూల్లో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ తాండూరు ఫారెస్టు ఆఫీసర్ శ్యాంసుందర్ రావుతో కలిసి మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణం పచ్చదనఁగా ఉంటేనే మానవ మనుగడ సాధ్యమవుతుందని అన్నారు. మొక్కలు నాటి పెంచితేనే పర్యావరణ పరిరక్షణ జరుగుతుందన్నారు. ఇందుకు అందరు బాధ్యతగా మొక్కలు నాటి పెంచాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ కన్వీనర్ మొలక మాసపత్రిక ప్రతినిధి కేవీఎం వెంకట్. శ్రీరామకృష్ణ సేవా సమితి గౌరవాధ్యక్షులు గాజుల బస్వరాజ్, రిటైర్డ్ హెచ్ఎం బిచ్చప్ప, బీట్ ఆఫీసర్ మల్లయ్య, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ టీచర్లు ఫాతీమాభేగం, పుష్పలత, పద్మ, ఝాన్సి, సుజాత తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

