ఇవేం.. బైరాగీ రాజకీయాలు..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

ఇవేం.. బైరాగీ రాజకీయాలు..!
– దాడి ఘటనపై చట్ట పరంగానే చర్యలు
– రాద్దాంతపు రాజకీయాలు మానుకోండి
– సంగెంకలాన్ మాజీ సర్పంచ్ మేఘనాథ్ గౌడ్
– బాధితులతో కలిసి విమర్శల ఖండన
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం సంగెంకలాన్ ఘర్షణలో బీజేపీ నాయకులు బైరాగీ రాజకీయాలు చేస్తున్నారని ఆ గ్రామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ యువ నాయకులు మేఘనాథ్ గౌడ్ విమర్శించారు. సోమవారం సంగెంకలాన్ దాడిలో గాయపడిన బాధితులు ఎరుకల సంతోష్, బావ యాదయ్యలతో కలిసి మేఘనాథ్ గౌడ్ మీడియాతో మాట్లాడారు.

దాడిలో కాంగ్రెస్ నాయకులు కక్ష్యపూరితంగా బీజేపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించేలా చేశారని బీజేపీ నాయకులు చేసిన ఆరోపణలను ఖండించారు. గ్రామంలో అందరు కులమతాలకు అతీతంగా జీవిస్తున్నారని అన్నారు. కొందరు కావాలనే దళిత వర్గాలకు చెందిన వారిపై దాడులకు పాల్పడి అల్లర్లు.. అశాంతికి పాల్పడుతున్నారని అన్నారు. దళిత వర్గాలకు చెందిన వారిపై మూకుమ్మడిగా దాడులు చేయడమే కాకుండా.. దీనిని అడ్డం పెట్టుకుని కావాలనే దాడులు చేయిస్తున్నారని అంటూ బీజేపీ నేతలు బైరాగీ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
kvcs
గొడవలను ప్రోత్సహించే నైజం తమది కాదని, గతంలో ఎన్నో వివాదాల్లో.. దాడుల్లో.. చిన్న.. చిన్న కేసులతో సరిపోయే సంఘటనలను పెద్ద కేసులుగా మార్చిన పేరు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు ఉందని అన్నారు. దాడిలో గాయపడి.. చావు దెబ్బతింటుంటే చూస్తూ ఊరుకుని ఉండిపోవాలా అని ప్రశ్నించారు. ఘర్షణలో ప్రాణాలు పోయి ఉంటే బాధ్యత ఎవరిపై ఉండేదని ప్రశ్నించారు. దాడిలో గాయపడిన బాధితులకు మద్దతు ఇస్తే.. కుట్రలు, కుతంత్రాల అంటూ అపవాదులను అంటగట్టడం సమంజసం కాదని అన్నారు. దళితులపై దాడులకు పాల్పడి.. వేదాలు వల్లించనట్లు రాజకీయాలు మానుకోవాలని అన్నారు. బాధితులను దాడి చేసిన ఘటనలో నిందితులకు చట్టపరంగానే చర్యలు తీసుకున్నారని, ఇందులో కాంగ్రెస్ పార్టీ నాయకులు కారణం అంటూ రాజకీయాలను జోడించడం మంచిదికాదన్నారు.

ఇదికూడా చదవండి…

కబ్జాలను తొలగించండి.. సారూ..!