మహరాజుల చుట్టూ రాజకీయం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మహరాజుల చుట్టూ రాజకీయం..!
– మాజీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లిన మనోహర్ రెడ్డి
– స్థానిక సంస్థల ఎన్నికలపై మంతనాలు
బషీరాబాద్, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలు షెడ్యూల్‌ విడుదలకు ముందే రాజకీయాలు వేడేక్కాయి. ఈ క్రమంలో బషీరాబాద్‌కు చెందిన మహారాజుల కుటుంబం చుట్టూ రాజకీయాలు జరగడం నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది.

కొన్ని రోజుల ముందు బీఆర్ఎస్ పార్టీ నుంచి తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తండ్రి బీఆర్ఎస్ నాయకులు పంజుగుల విఠల్ రెడ్డి, బాబాయి పంజుగుల శ్రీశైల్ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే నారాయణరావు కలిశారు. కొన్ని రోజుల తరువాత తాండూరుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కూడా బషీరాబాద్‌ మండల కేంద్రానికి చేరుకుని స్వయంగా మాజీ ఎమ్మెల్యే నారాయణ రావును కలిశారు. ఈ భేటీలు మొత్తం అచ్చంగా స్థానిక సంస్థల ఎన్నికల మీదనే జరిగాయని ప్రచారం ఉంది. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే నారాయణ రావు కుమారుడు రోహిత్ రావు పోటీ చేస్తున్నారని జోరందుకుంది.
kvcs
గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీలో మహరాజుల కుటుంబానికి తగిన ప్రాధాన్యం దక్కడం లేదని పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలు చెబుతున్నాయి. దీనినే ప్రతిపక్ష పార్టీలు అవకాశంగా మార్చుకుని మహరాజులను తమ వైపు తిప్పుకునేలా పాచికలు వేసినట్లు కనిపిస్తోంది. తాజాగా మంగళవారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి బషీరాబాద్‌ మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే నారాయణ రావుతో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల గురించే చర్చలు జరిగినట్లు పార్టీ వర్గాల సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం ఎలా ముందుకు సాగాలనే దానిపై మంతనాలు చేసినట్లు కనిపిస్తోంది. మొత్తానికి తాండూరు నియోజకవర్గంలో మహరాజుల కుటుంబం చుట్టూ రాజకీయాలు జరుగుతుండం ఆసక్తికర పరిణామంగా మారింది. మాజీ ఎమ్మెల్యేను కలిసిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వెంట తాండూరు కాంగ్రెస్ నాయకులు డా. సంపత్ కుమార్, మండల నాయకులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

శభాష్.. ఆదిత్య వర్దన్..!