యమ పాశమైన ఇనుపతీగ..!

క్రైం తాండూరు వికారాబాద్

యమ పాశమైన ఇనుపతీగ..!
– విద్యుత్ షాక్‌తో భార్య, భర్తల మృతి
– బొంరాస్‌పేట్ మండలంలో విషాధం
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: ఇంటి ముందు ఉన్న ఓ ఇనుప తీగ భార్య, భర్తల పాలిట యమపాశమైంది. ఆ తీగ నుంచి విద్యుత్ షాక్ తగలడంతో వారిద్దరు మృతి చెందారు. భర్తను కాపాడేందుకు వెళ్లిన భార్య యమపాశానికి బలైపోవడంతో తీవ్ర విషాధాన్ని నింపింది. ఈ విషాధకర సంఘటన సోమవారం వికారాబాద్‌ జిల్లా కోడంగల్ నియోజకవర్గం బొంరాస్ పేట్ మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని బురాన్‌ పూర్ గ్రామానికి చెందిన బోయిని లక్ష్మణ్‌ ఇంటి వాకిలిలో ఉతికిన బట్టలను ఆరేసేందుకు వెళ్లాడు.

అక్కడే ఉన్న ఇనుప తీగకు బట్టలను ఆరేస్తుండగా అకస్మాత్తుగా దానికి విద్యుత్ సరఫరా కావడంతో లక్ష్మణ్‌ షాక్‌కు గురయ్యాడు. గమనించిన భార్య బోయిని లక్ష్మీ భర్త లక్ష్మణ్‌ను కాపాడేందుకు వెళ్లగా ఆమెకు కూడా విద్యుత్ షాక్ తగలడంతో ఆమె కూడా అక్కడికక్కడే మృతి చెందింది.

గమనించిన స్థానికులు విద్యుత్ సరఫరాను ఆపేశారు. భార్య, భర్తలు ఒకేసారి మరణించడంతో గ్రామంలో విషాధం నిండింది.

ఇది కూడా చదవండి..

సార్లు వస్తున్నారు..!