ట్రైన్లో నుంచి ఫోన్ పడిపోయిందా..!
– అయితే ఈ టిప్స్ పాటిస్తే పోయింది చేతికోస్తుంది
– ఎవరైనా చోరి చేసినా కూడా కనిపెట్టొచ్చు
– ఎలా.. ఏం చేయాలో తెలుసుకోండి..
దర్శిని డెస్క్ : రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఎవరైనా ప్రమాద వశాత్తు మోబైల్ ఫోన్ పోగొట్టుకుంటుంటారు. లేదా ఎవరైనా దొంగ చేతివాటినికి బలైపోతుంటారు. ఇలాంటి సమమయంలోనే ఈ నియమాలు పాటిస్తే.. పడిపోయినా.. లేదా పోగొట్టుకున్న మీ మోబైల్ ఫోన్ మళ్లీ మీ చేతికి రావడం ఖాయం. అందుకుకోసం ఏం చేయాలో.. ఎలా.. చేయాలో తెలుసుకుందాం రండి..

ఫోన్ పోయిన సమయంలో కంగారు పడే బదులు.. ఫోన్ ఎక్కడ పడిందో గమనించడంపై దృష్టి పెట్టండి. రైల్వే ట్రాక్‌లపై స్తంభాలు, కిలోమీటర్ గుర్తులు ఉంటాయి, ఇవి పోగొట్టుకున్న వస్తువులను గుర్తించడానికి కీలకమైన రిఫరెన్స్ పాయింట్లుగా పనిచేస్తాయి. స్తంభాల సంఖ్య, సమీపంలోని గుర్తు లేదా కనిపించే ఏదైనా ల్యాండ్‌మార్క్‌ను గుర్తుంచుకోవడం వల్ల రికవరీ అవకాశాలు గణనీయంగా మెరుగుపడతాయి.

వెంటనే RPF హెల్ప్‌లైన్‌ను సంప్రదించండి..
తోటి ప్రయాణీకుల ఫోన్ తీసుకొని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ హెల్ప్‌లైన్ 182 కు కాల్ చేయండి. ఫోన్ ఎక్కడ పోయిందో చెప్పండి. ఇంకా కచ్చితంగా అక్కడ పోల్స్ నంబర్స్, లేక స్టేషన్ దాటిన తర్వాత, వచ్చే ముందు ఇలా గుర్తులు చెప్పండి. దాంతో పాటు రైలు నంబర్, కోచ్ నంబర్, ఫోన్ పడిపోయిన సుమారు స్థానం, మీ సంప్రదింపు వివరాలు చెప్తే.. వాళ్లు వెంటనే సమీప స్టేషన్‌లోని RPF బృందాన్ని అప్రమత్తం చేస్తారు. వారు ఫోన్‌ను తిరిగి పొందగలరు. 182 అందుబాటులో లేకపోతే, ప్రయాణీకులు 1512 (ప్రభుత్వ రైల్వే పోలీసు హెల్ప్‌లైన్) లేదా సాధారణ రైల్వే ప్రయాణీకుల హెల్ప్‌లైన్ 138ని కూడా సంప్రదించవచ్చు.

ఫాలో అప్ చేసి ఫోన్ తీసుకోండి
ఒక వేళ ఫోన్ ఆర్పీఎఫ్ వారికి దొరికితే దాన్ని సమీపంలోని RPF లేదా GRP పోస్ట్‌లో ఉంచుతారు. ప్రయాణీకులకు రిఫరెన్స్ లేదా ఫిర్యాదు నంబర్ అందుతుంది, దీనిని ఉపయోగించి శోధన స్థితిని ట్రాక్ చేయవచ్చు. ఫోన్‌ను క్లెయిమ్ చేయడానికి, యజమాని చెల్లుబాటు అయ్యే IDని చూపించి, ధృవీకరణ తర్వాత దానిని అందజేసే ముందు పరికరం గురించి కీలక వివరాలను నిర్ధారించాలి.
ఇదికూడా చదవండి…

