జై.. శ్రీరాం.. జైజై శ్రీరాం..!
– ఘనంగా గర్భగుడి నిర్మాణ పనులు
– ఇందిరా నగర్ రాంమందిర్‌లో పూజలు
– పూజలో పాల్గొన్న డా.సంపత్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : జై.. శ్రీరాం.. జైజై శ్రీరాం అంటూ భక్తులు శ్రీరామచంద్రున్ని తలుచుకున్నారు. తాండూరు పట్టణం ఇందిరానగర్‌లో శ్రీ రామందిర పునర్ నిర్మాణ పనులు గురువారం మళ్లీ ప్రారంభమయ్యాయి.

ఇందులో భాగంగా గురువారం దేవాలయంలో ఆలయ గర్భగుడి నిర్మాణ పనులను భక్తి శ్రద్దలతో ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి తాండూరు కాంగ్రెస్ నాయకులు, బీవీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, బాలాజీ నర్సింగ్ హోమ్ అధినేత డా.సంపత్ కుమార్ హాజరయ్యారు. ఆలయ పండితులు, దేవాలయ కమిటి సభ్యుల సమక్షంలో నిర్మాణ పనులు చేపట్టారు.

ఈ సందర్భంగా ఈ సందర్భంగా డా.సంపత్ కుమార్, ఆలయ కమిటి సభ్యులు మాట్లాడుతూ శ్రీరాముని ఆశీస్సులు అందరిపై ఉండాలని ప్రార్ధించారు. మహా యజ్ఞంగా చేపడుతున్న శ్రీ రామ మందిర పునర్ నిర్మాణానికి ఇంకా దాతలు, భక్తులు వస్తూ రూపేణా, ధన రూపేణా సహాకారం అందించాలని కోరారు.

ఇదికూడా చదవండి…

