కుటుంబాల బాధ తీర్చలేనిది..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

కుటుంబాల బాధ తీర్చలేనిది..!
– బాధితులు ధైర్యంగా ఉండాలి
– తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– చేవెళ్ల రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు పరామర్శ
తాండూరు, దర్శిని ప్రతినిధి : రోడ్డు ప్రమాదం కబళించిన మృత్యు కుటుంబాలకు వచ్చిన బాధ తీర్చలేనిదని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. చేవెళ్ల వద్ద నిన్న చోటుచేసుకున్న భయానక రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను మంగళవారం పైలెట్ రోహిత్ రెడ్డి పరామర్శించారు.

తాండూరు పట్టణ ప్రాంత వాసులు ఖలీద్, ముస్కాన్, తబస్సుం, యాలల్ మండలంలో లక్ష్మి నారాయణపూర్ లో అఖిల రెడ్డి అంతక్రియలో పాల్గొని కుటుంబాన్ని ఓదార్చారు. యాలాల మండలం పేర్కంపల్లి, గ్రామంలో నందిని,తానుష, సాయి ప్రియ, కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం తెలిపారు. యాలాల మండలం హాజీపూర్, గ్రామంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను ఓదార్చి చిన్నారులకు ఎల్లవేళలా తోడ్పాటు అందిస్తానని ఆయన తెలిపారు. మృతుల కుటుంబాలకు పదివేల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు.
kvcs
ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆ కుటుంబాల బాధ చూసి మనసు కలచి వేసింది. ప్రాణాలు కోల్పోయిన వారికి ఆత్మశాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు దేవుడు ధైర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తెలిపారు. అలాగే ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన రహదారి భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. రోడ్డు విస్తరణ పనులు వెంటనే మొదలు పెట్టాలని కోరారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, అఫ్పూ(నయూం), రవీందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

మృతురాలి కుటుంబానికి సాయం