మృతురాలి కుటుంబానికి సాయం
– అందజేసిన బీఆర్ఎస్వీ నాయకుడు సందీప్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆర్టీసీ బస్సు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మృతురాలి కుటుంబానికి బీఆర్ఎస్వీ తాండూరు పట్టణ అధ్యక్షులు పట్లోళ్ల సందీప్ రెడ్డి ఆర్థిక సాయం అందజేశారు.

సోమవారం ఉదయం చేవేళ్ల మండలం మిర్జాగూడ దగ్గర జరిగిన టిప్పర్ లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో తాండూరు పట్టణం 23వ వార్డు వాల్మీకీనగర్‌కు చెందిన ప్రసాద్ భార్య వెంకటమ్మ(స్వాతి) మృతి చెందిన సంగతి తెలిసిందే.

మంగళవారం బీఆర్ఎస్వీ పట్టణ అధ్యక్షులు పట్లోళ్ల సందీప్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబానికి తనవంతుగా ఆర్థికసాయం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షులు జోగుల ఎబినేజర్ తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

