యువత సామాజిక సేవ ప్రశంసనీయం

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

యువత సామాజిక సేవ ప్రశంసనీయం
– ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి
– సాయిపూర్లో ఉచిత కంటి వైద్య శిబిరం
– రక్తదాన శిబిరానికి విశేష స్పందన
తాండూరు, దర్శిని ప్రతినిధి : యువత సామాజిక సేవకు ముందుకు రావడం ప్రశంసనీయమని తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

గురువారం తాండూరు పట్టణం సాయిపూర్ 11వ వార్డులో యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బంటు వేణుగోపాల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, ఎల్ఎన్ఆర్ యువసేన ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాలను నిర్వహించారు. బుయ్యని శ్రీనివాస్ రెడ్డి హాజరై ప్రారంభించిన శిబిరాలకు విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ యువ నేతలు సామాజిక సేవలో భాగంగా రక్తదాన శిబిరం, ఉచిత కంటి వైద్య శిభిరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు.

సమాజ హితం కోసం అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, అందరు రక్తదానికి ముందుకు రావాలన్నారు. అదేవిధంగా పేదల కోసం ఎల్ఎన్ఆర్ యువసేన కంటి వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయం అని అన్నారు. ఈ శిబిరాల సేవలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బంటు వేణుగోపాల్ మాట్లాడుతూ జిల్లా ఆసుపత్రిలో రక్త నిల్వల కొరత ఏర్పడడంతో శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

ఎల్ఎన్ఆర్ యువసేన సభ్యులు లొంక నర్సింలు మాట్లాడుతూ హైదరాబాద్ శంకర్ కంటి ఆసుపత్రి సహాకారంతో పేదల కోసం తమ వంతు సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మరోవైపు రక్తదాన శిబిరంలో పాల్గొన్న యువకులకు శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, కాంగ్రెస్ నాయకులు బంటు మల్లప్ప, నర్సింగ్ రావు, సాయిపూర్ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.


ఇదికూడా చదవండి…

గల్లీ బాయ్స్ మానవత్వం..!