వామ్మో.. వీళ్లేం.. ఎర్రోళ్లు కాదు..!
– ఏకంగా పంట పొలంలో గంజాయి సాగు
– ఎక్సైజ్ అధికారుల దాడుల్లో గుట్టు రట్టు
– పొలంలో గంజాయి మొక్కల స్వాదీనం
– పరారిలో తండ్రి, కుమారుడి రిమాండ్
– వివరాలు వెల్లడించిన జిల్లా ఎక్సైజ్ అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వాళ్ల ఇంటిపేరు ఎర్రోళ్ల.. కాని వాళ్లేం.. ఎర్రోళ్లు(వెర్రివాళ్లు) కాదని నిరూపించారు.. తండ్రి కొడుకులు ఏకంగా పంట పొలంలో గంజాయి సాగుచేస్తూ అక్రమ వ్యాపారం సాగిస్తున్నారు. జిల్లా ఎక్సైజ్ పోలీసులు దాడులు చేయడంతో వారి గుట్టు రట్టుయ్యింది.

పొలంలో సాగుతున్న గంజాయి మొక్కలను అధికారులు స్వాదీనం చేసుకున్నారు. గంజాయి సాగుకు పాల్పడుతున్న తండ్రి కోడుకులపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటన మంగళవారం తాండూరు ఎక్సైజ్ పోలి స్టేషన్ పరిధిలో జరిగింది. జిల్లా ఎక్సైజ్ సూపిరిండెంట్ విజయభాస్కర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కోట్పల్లి మండలం బార్వాద్ గ్రామానికి చెందిన ఎర్రోళ్ల పెంటయ్య, ఆయన కుమారుడు ఎర్రోళ్ల ప్రభాకర్ లు వారికి చెందిన సర్వేనెంబర్ 33391/3లో ఉన్న పొలంలో గంజాయిని సాగుచేస్తున్నారు. పొలంలో గంజాయి పండించి విక్రయాలకు పాల్పడుతున్నారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు డీటీఎఫ్ వికారాబాద్, తాండూరు ఎక్సైజ్ శాఖ అధికారుల బృందం సంయుక్తంగా దాడులు నిర్వహించారు.

ఈ దాడుల్లో పొలంలో సాగుచేస్తున్న 108 మొక్కలు సుమారుగా 1.5కిలోల ఎండు గంజాయిని స్వాదీనం చేసుకున్నారు. తండ్రి ఎర్రోళ్ల పెంటయ్య పరారిలో ఉండగా కుమారుడు ఎర్రోళ్ల ప్రభాకర్ ను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. కుమారుడు ఎర్రోళ్ల ప్రభాకర్ ను రిమాండుకు తరలించినట్లు ఎక్సైజ్ సూపరిండెంట్ విజయభాస్కర్ తెలిపారు.

ఈ సందర్బంగా జిల్లా ఎక్సైజ్ అధికారి విజయభాస్కర్ మాట్లాడుతూ అక్రమంగా గంజాయి ని పండించడం, అమ్మడం, కలిగి ఉండటం చట్ట రీత్యా నేరం అని అన్నారు. మాదకద్రవ్యాలపై సమాచారం ఉంటే ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందించాలని, వివరాలు గోప్యంగా ఉంచబడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఎస్ శ్రీనివాస్ రెడ్డి, డీటీఎఫ్ సీఐ శ్రీనివాస్, తాండూరు ఎక్సైజ్ సీఐ రాణి, డీటీఎఫ్ ఎస్ఐఐ ప్రేమ్ కుమార్ రెడ్డి, తాండూరు ఎక్సైజ్ ఎస్ఐలు నిజాముద్దీన్, రవికుమార్, సిబ్బంది శివ, ప్రసాద్, హన్మంతు, రవి కిరణ్, మహేష్, ఆసిఫా భేగం, రాధిక, భీమయ్య, రమేష్, కుమార్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

