కమణీయం.. శ్రీవారి కళ్యాణోత్సవం..!

తాండూరు వికారాబాద్

కమణీయం.. శ్రీవారి కళ్యాణోత్సవం..!
– వైభవంగా రథోత్సవం – భారీగా తరలివచ్చిన భక్తులు
– దర్శించుకున్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
తాండూరు రూరల్, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరు మండలం అంతారం అనుబంద గ్రామం దస్తగిరి పేట్ (చంద్రగిరిపట్నం)లో వెలసిన శ్రీ శ్రీదేవి భూదేవి శ్రీ వేంకటేశ్వర స్వామి వార్ల కళ్యాణోత్సవం, రథోత్సవ వేడుకలు బుధవారం కమనీయం.. రమణీయంగా సాగాయి. స్వామి వార్ల కళ్యాణా త్సవం, రథోత్సవ ఉత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయం నుంచి ప్రారంభమైన దేవాలయ వార్షికోత్సవాలను పురస్కరించుకుని ఆలయ ధర్మకర్తలు, అర్చకులు వెంకటచార్ శుక్రవార్, రాఘవాచార్ శుక్రవార్, పురందరాచార్ శుక్రవార్లతో పాటు తాండూరుకు చెందిన గంగిశెట్టి సుబ్రమణ్యం కుమారులు శ్రీనివాస్, గోపికృష్ణ సహాయ సహకారాలతో పౌర్ణమి సందర్భంగా స్వామి వార్ల కళ్యాణోత్సం జరిపించారు.
అనంతరం స్వామి వార్లను పల్లకిలో ఊరేగిస్తూ రథోత్సవ వేడుకలను నిర్వహించారు. రథాన్ని పల్లకిని కళ్యాణోత్సవంలో పాల్గొంటే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల వి శ్వాసంలో పెద్ద ఎత్తున హాజరై ఘనంగా ఉత్సవాలను నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా ఆలయంలో భక్తుల భజనకీర్తనలు ఆకట్టుకున్నాయి.

దర్శించుకున్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
మరోవైపు ఆలయంలో శ్రీవారి కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకుని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి దేవాలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చిన స్వామి వార్లను దర్శించుకున్నారు. కళ్యాణోత్సవంలో శ్రీ శ్రీదేవి భూదేవి శ్రీ వేంకటేశ్వర స్వామిని కూడ దర్శించుకుని అనుగ్రహం పొందారు. ఎమ్మెల్యే వెంట తాండూరు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షులు రాములు, టీఆర్ఎస్ నాయకులు పటేల్ ఉమాశంకర్, ఇందర్ చడ్ రాజు, శకుంతల, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.