ఇదేంటి ‘దుర్గా’..!
– మొన్న బిర్యానీలో బొద్దింక
– ఇప్పుడు కుళ్లిన చికెన్ పీసులు
– వివాదాస్పదంగా రెస్టారంట్ తీరు
తాండూరు, దర్శిని ప్రతినిధి : బిర్యానీ తినాలనుకుంటే మనకు నచ్చిన హోటల్ లేదా రెస్టారంట్ వెళతాం. నమ్మి వెళ్లిన రెస్టారంట్లో పాడైన, కుళ్లిన బిర్యాని పెడితే ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి.

ఒకసారి జరిగితే తప్పు.. మళ్లీ.. మళ్లీ అదే జరిగితే రెస్టారంట్ తీరుపై అనునామాలు వ్యక్తమవుతాయి. ఇలాంటి పరిస్థితిని తాండూరు హైదరాబాద్ రోడ్డు మార్గంలోని దుర్గా రెస్టారంట్ ఎదుర్కొంటోంది. మూడు నెలల క్రితం ఇదే రెస్టారంట్లో బిర్యాని తినేందుకు వెళ్లిన కస్టమర్‌కు బొద్దింక దర్శనమిచ్చింది. అప్పట్లో ఈ వ్యవహారం దుమారం అయ్యాయి. తాజాగా ఇదే సీన్ రిపీట్ అయ్యింది.

పట్టణంకు చెందిన కొందరు యువకులు బిర్యాని తినేందుకు రెస్టారంట్‌కు వెళ్లారు. జంబో ప్యాక్ అర్డర్ చేసుకున్నారు. ఆశగా తిందామనుకునేలోపు చికెన్ పీసులు కుళ్లిపోయినట్లు అనిపించాయి. వెంటనే హోటల్ నిర్వహకులను నిలదీశారు.

ఈ క్రమంలో కస్టమర్లు, నిర్వహకుల మద్య వాగ్వివాదం జరిగింది. దీంతో ఈ సంఘటన బయటకు రావడంతో వివాదాస్పదంగా మారింది. మూడు నెలల క్రితం జరిగిన బొద్దింక ఘటనలో కస్టమర్ కావాలనే రాద్దాంతం చేశారని నిర్వహకులు ఆరోపించారు. తాజాగా జరిగిన ఘటనలో కస్టమర్లతో వాగ్వివాదం చేయడం వివాదాస్పదంగా మారింది.

ఇదికూడా చదవండి…

