‘పగల మద్య’ పోయిన ప్రాణం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

‘పగల మద్య’ పోయిన ప్రాణం..!
– కత్తిపోట్లతో తాండూరుకు ఉలికిపాటు
– స్వయంగా పర్యవేక్షించిన డీఐజీ ఎల్ఎస్ చౌహాన్
– జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రాతో కలిసి వివరాల ఆరా
– కేసులో ఆరుగురు నిందితుల రిమాండు
– కేసును చేధించిన పోలీసులకు అభినందనలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇద్దరి మద్య ఉన్న పాత పగల వల్ల జరిగిన హత్యాయత్నంలో ఓ నిండు ప్రాణం బలైపోయింది. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం రాజీవ్ కాలనీలో జరిగిన కత్తిపోట్ల ఘటన ఉలికిపాటుకు గురి చేసింది. దీంతో స్వయంగా తెలంగాణ రాష్ట్ర జోగులాంబ జోన్ డీఐజీ చౌహాన్ తాండూరును సందర్శించి పరిస్థితులను పర్యవేక్షించారు. కలకలం రేపిన కేసులో ఆరుగురు నిందితులను రిమాండుకు తరలించినట్లు వెల్లడించారు.

వివరాల్లోకి వెళితే.. తాండూరు మండలం ఖాంజాపూర్ గ్రామానికి చెందిన గోపాల్, తాండూరు పట్టణం ఇందిరమ్మ కాలనీకి చెందిన కిట్టుల మద్య గొడవలు జరుగుతున్నాయి. గోపాల్ కిట్టును చంపాలని పథకం వేసుకున్నాడు. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం వేళ గోపాల్ తన వెంట కత్తి తెచ్చుకున్నాడు. రాజీవ్ కాలనీ సమీపంలో ఉన్న గోపాల్ అతని అనుచరులు ఇందిరమ్మ కాలనీకి చెందిన శెట్టి కేరోల్ల ఆదర్, ఖాంజాపూర్ కు చెందిన మద్దూరు అనిల్, కుర్వ ప్రవీణ్, ఇందిరమ్మ కాలనీకి చెందిన చిన్నగళ్ల క్రిష్ణ, హన్మంతూరు ప్రశాంత్ లతో కలిసి కిట్టుపై దాడి చేసేందుకు యత్నించాడు. అంతలోనే కిట్టు అక్కడే ఉన్న నూర్ హైమద్ (60) కు చెందిన చికెన్ షాపులో దూరి షెటర్ వేసుకున్నాడు.

లోపలికి వెళ్లేందుకు యత్నించిన గోపాల్ ను నూర్ హైమద్ అడ్డుకోవడంతో అదే కోపంలో కత్తితో నూర్ హైమద్ పై దాడికి పాల్పడ్డాడు. కత్తి పోట్లకు గురైన నూర్ హైమద్ తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడే ఉన్న కుమారుడు అబు సుఫియాన్ కూడా గోపాల్ ను నిలదీయడంతో అతనిపై కూడా దాడికి యత్నించాడు. స్థానికుల రాకతో గోపాల్ అక్కడి నుంచి పరారయ్యాడు. గమనించిన స్థానికులు తండ్రి, కుమారులను తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నూర్ హైమద్ ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించగా మార్గ మద్యలో మృతి చెందాడు. కుమారుడు అబు. సుఫియాన్ ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ గురువారం రాత్రే తాండూరు పట్టణానికి చేరుకున్నారు. వికారాబాద్ జిల్లా ఎస్సీ స్నెహా మెహ్రాతో కలిసి పరిస్థితిని సమీక్షించారు.

జిల్లా ఆడిషనల్ ఎస్పీ రాములు నాయక్, తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, తాండూరు రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్, పట్టణ సీఐ సంతోష్ కుమార్. యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డి వారి బృందాలతో విచారణ ముమ్మరం చేశారు. వ్యక్తి హత్యకు కారకుడు అయిన గోపాల్ తో పాటు మిగతా 5గురు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండుకు తరలించడం జరిగిందని డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ మీడియాకు వెల్లడించారు. కిట్టుకు, గోపాల్ కు మధ్య పాత పగలు ఉండడంతో అతన్ని హత్య చేయాలని భావించాడని, మద్యలో నూర్ హైమద్, ఆతని కుమారుడు అబు సుఫియాన్ రావడంతో వారిపై దాడికి పాల్పడినట్లు వివరించారు. తాండూరు ప్రాంతంలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా రక్షణ చర్యలు తీసుకోవడడం జరుగుతుందని వివరించారు. ఈ కేసులో ఉత్తమ పనితీరును కనబరిచిన సిబ్బందిని అభినందించారు.

ఇదికూడా చదవండి…

తాండూరులో ఏం.. జరుగుతోంది..?!