రక్తదానికి పిలుపునిచ్చిన ఆర్టీసీ
– ఈనెల 30న రక్తదాన శిబిరం ఏర్పాటు
తాండూరు, దర్శిని ప్రతినిధి: ప్రయాణికులను సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చే ఆర్టీసీ రక్తదాన శిబిరం ఏర్పాటుకు ముందుకువచ్చింది. ఈనెల 30 రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలలో రక్తదాన శిబిరాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తాండూరు ఆర్టీసీ డీపోలో కూడ వచ్చే మంగళవారం 30వ తేదిన రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు డీపో మేనేజర్ రాజశేఖర్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారితో పాటు తలసేమియాతో బాధపడుతున్న వారిని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ప్రముఖ రెడ్ క్రాస్ సంస్థ వారి తోడ్పాటుతో ఏర్పాటు చేస్తున్న రక్త దాన శిబిరానికి ఆరోగ్యవంతులు, యువకులు పెద్ద యెత్తున పాల్గొని రక్త దానం చేయాలని కోరారు. రక్తదానం చేసేవారు రేపు ఆదివారం సాయంత్రం 5గంటలలోపు పేర్లను నమోదు చేసుకోవాలని, వివరాలకు డిపో మేనేజర్ 9959226251, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సోమ్లా 7382839193, వెల్పేర్ కమిటీ మెంబెర్ 8309348157కు సంప్రదించాలని కోరారు. 30వ తేదిన మంగళవారం ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రక్తదాన శిబిరం కొనసాగుతుందని చెప్పారు.


