ఇంటింటి ఫీవ‌ర్ స‌ర్వే షురూ..!

ఆరోగ్యం తాండూరు వికారాబాద్

ఇంటింటి ఫీవ‌ర్ స‌ర్వే షురూ..!
– స‌ర్వే చేప‌ట్టిన ప్ర‌త్యేక బృందాలు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: క‌రోనా మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేసేందుకు ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు తాండూరు మున్సిప‌ల్ ప‌రిధిలో ఫీవ‌ర్ స‌ర్వే ప్రారంభ‌మ‌య్యింది. తాండూరు ఆర్డీఓ, మున్సిప‌ల్ ఇంచార్జ్ క‌మీష‌న‌ర్ అశోక్ కుమార్ సూచ‌న‌ల‌తో మున్సిప‌ల్‌లోని 36వ వార్డుల‌లో స‌ర్వేను చేప‌ట్టారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, వార్డు స్పెష‌ల్ ఆఫీస‌ర్లు, మెప్మా ఆర్పీలు, అంగ‌న్‌వాడి టీచ‌ర్లు, వీఆర్ఓ సిబ్బందితో కూడిన ఈ బృందాలు ఇంటింటి స‌ర్వేతో ప్ర‌జ‌ల వివ‌రాల‌ను న‌మోదు చేసుకున్నారు. ఇండ్ల‌లో ఎవ‌రైనా జ్వ‌రం, ద‌గ్గు, జ‌లుబుతో పాటు కోవిడ్ ల‌క్ష‌ణాలు ఎవ‌రికైనా ఉన్నాయా.. ? లేదా..? అనే వివ‌రాల‌ను న‌మోదు చేసుకున్నారు.

ల‌క్ష‌ణాలు ఉన్న‌వారి ఇండ్ల‌లో అజిత్రో మైసిన్, పారాసిట‌మిల్, లేవో సిట్ర‌జిన్, రానిటిడైన్, విట‌మిన్ సీ, డీ క‌లిగిన మెడిసిన్‌ను అంద‌జేశారు. మ‌రోవైపు ఫీవ‌ర్ స‌ర్వేలో వాటితో పాటు వ్యాక్సీనేష‌న్ వివ‌రాల‌ను కూడ ఆరా తీశారు. ఫ‌స్ట్ డోస్, సెంక‌డ్ డోస్, బూస్ట‌ర్ డోస్ వేసుకునే వారి వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సీనేష‌న్ వేసుకోని వారికి వైద్య సిబ్బందితో టీకా వేశారు.